Myth Or Fact on Kidney Stones : బీరు తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా..?

by Disha Web Desk 10 |
Myth Or Fact on Kidney Stones : బీరు తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా..?
X

దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య వల్ల చాలా మంది బాధ పడుతున్నారు. అనేది సాధారణంగా కిడ్నీల గురించి వినే ఉంటారు. వివిధ రకాల ఖనిజాలు చేరడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. దీనినే కిడ్నీ స్టోన్ అంటారు. కిడ్నీ స్టోన్స్ గురించి అపోహలు మిమ్నల్ని ప్రమాదకర స్థాయికి తీసుకువెళ్లవచ్చు.

మూత్రపిండాలు మానవ శరీరంలో అత్యంత శక్తివంతమైన అవయవాలలో ఒకటి. మూత్రపిండాల యొక్క ప్రధాన విధి రక్తాన్ని శుద్ధి చేయడం. అందువల్ల, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. కిడ్నీలో రాళ్ల సమస్యలు తీవ్ర నొప్పిని కలిగిస్తాయి. మూత్రంలో రక్తం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వస్తాయి. మరోవైపు కిడ్నీలో రాళ్ల గురించి కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

కిడ్నీలో రాళ్లు పురుషులను మాత్రమే ప్రభావితం చేస్తాయని ఒక సాధారణ అపోహ ఉంది. నిజానికి ఈ సమస్య మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువగా వస్తుంది. కానీ మహిళలు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవలి కాలంలో మహిళల్లో కూడా ఈ సమస్య పెరుగుతోంది.బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇది నిజం కాదు. నిజానికి, బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. బీర్ మూత్రంలో కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని నమ్మకండి.



Next Story

Most Viewed