యవ్వనంగా ఉండాలి అనుకుంటున్నారా.. అయితే ఈ గింజలు తినాల్సిందే..

by Disha Web Desk 7 |
యవ్వనంగా ఉండాలి అనుకుంటున్నారా.. అయితే ఈ గింజలు తినాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: యవ్వనంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరిక ఉంటుంది. అయితే ఎలాంటి చర్మ, కంటి, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ గింజలు తినాలట. నిత్య యవ్వనం మీ సొంతం అవుతుంది. ఇంతకీ ఆ గింజలు ఏంటి అనుకుంటున్నారా..?

అన్నాట్టో సీడ్స్..

*ఈ గింజల్లో అమైనో ఆమ్లాలు, కాల్షియం, ఇనుము, భాస్వరం, విటమిన్ బీ-2,3 అధికంగా ఉంటాయి. దీంతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

*అంతేకాకుండా కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కణాలు, డీఎన్ఏకు ఫ్రీ రాడికల్ కారణంగా కలిగే నష్టాలను నివారిస్తాయి.

*ఈ అన్నాట్టో సీడ్స్‌లో ఉండే ఫైటోకెమికల్స్ సైనిడిన్, ఎలాజిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, సపోనిన్లు, టానిన్లు వంటి లక్షణాలు వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తాయి.

*ఈ గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మనల్ని చర్మ సమస్యలను నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా పొడి చర్మం, ముడతలను తగ్గించడమే కాకుండా వృద్ధాప్యాన్ని తగ్గించి నిత్య యవ్వనంగా ఉండేలా చేస్తాయి.

*అన్నాట్టో సీడ్స్ ఇన్ని గుణాలు ఉన్న కారణంగా వీటిని చాలా కాస్మోటిక్ ఉత్పత్తుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.



Next Story

Most Viewed