సినిమా చూస్తున్నప్పుడు లేదా నవ్వుతున్నప్పుడు పక్కవారిని ఎందుకు కొడుతారో తెలుసా?

by Disha Web Desk 8 |
సినిమా చూస్తున్నప్పుడు లేదా నవ్వుతున్నప్పుడు పక్కవారిని ఎందుకు కొడుతారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సినిమాలు చూస్తున్న సమయంలో కానీ, ఏదైనా సరదాగా మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ పక్కవారిని కొడుతూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వారు ఎందుకు అలా కొడుతారు. ఇది ఏమైనా సమస్యనా లేకపోతే దీని వెనుక ఏదైనా కారణం ఉందా? కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంత మంది మాట్లాడుతూ.. సినిమాలో జోక్స్ వస్తే నవ్వుతూ పక్కవారిని కొడుతుంటారు. మన పక్కన ఎవరు ఉన్నారని కూడా పట్టించుకోకుండా కొడుతారు. కొన్ని సార్లు ఇది సమస్యలకు కూడా దారి తీయవచ్చు. అయితే ఇలా కొట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయంట. అవి ఏమిటంటే?

కొంత మంది ఎమోషన్స్‌ని కొట్టడం ద్వారా బయటపెడుతారంట. వారు ఎక్కడ ఉన్నాం అనేది కూడా పట్టించుకోరు. అలాగే ఇంకొంత మంది అత్యుత్సాహంగా.. అంటే ఏదైనా ఎగ్జైట్మెంట్ కలిగించే వార్త లేదా ఫన్నీ జోక్స్ సమయంలో చాలా నవ్వు తెప్పించినప్పుడు, లేదా చాలా సంతోషంగా ఉన్నప్పుడు మాట్లాడుతూ పక్కవారిని కొడుతారు. ఇంకొంత మంది చికాకుగా లేదా, సినిమా చూస్తున్నప్పుడు నిరాశ, ఒత్తిడి, చికాకుతో కూడా పక్కవారిని కొడతారు అంటున్నారు నిపుణులు. ఇంకొంతమందికి చిన్నప్పటి నుంచి పక్కవారిని కొట్టడం అనేది అలవాటుగా ఉంటుందంట. అందువలన వారు తమ పక్కన ఉన్నవారిని కొడుతూ మాట్లాడుతారు.

అయితే ఇది కూడా ఒక వ్యాధిలాంటిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీని వలన ఎదుటి వారు కొన్ని సందర్భాల్లో హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతే కాకుండా పెద్దవారితో మాట్లాడుతున్న, లేదా ఇంపార్టెంట్ మీటింగ్ సమయంలో ఇలా బిహేవ్ చేయడం అనేది చాలా ఇబ్బందులను తీసుకొస్తుంది. అలాగే మనకు తెలియకుండా మనం ఇలా పక్కవారిని కొడుతాం.. ఇది వారిని ఇబ్బంది పెట్టవచ్చు. అందువలన దీనిని నుంచి పూర్తిగా బయటకు రావాలి అంటున్నారు. మీరు కొట్టడానికి ఒక్క సెకన్ దాని గురించి ఆలోచించడం లేదా అవగాహన చేసుకోవడం వలన దీని నుంచి బయటపడవచ్చునంట.


Next Story