Gold Rates :1966 నుంచి 2023 వరకు బంగారం ధర ఎలా ఉందో తెలుసా..?

by Disha Web Desk 20 |
Gold Rates :1966 నుంచి 2023 వరకు బంగారం ధర ఎలా ఉందో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముదుసలి వరకు ప్రతి ఒక్కరు బంగారం మీద మక్కువ చూపిస్తుంటారు. అందుకే బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. అయితే 1966వ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు బంగారం ధరలు ఏవిధంగా పెరిగాయో చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. మరి అప్పటి కాలంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఎంతగా పెరిగాయో ఓ లుక్ వేసేద్దామా...

సరిగ్గా 57 ఏండ్ల క్రితం అంటే 1966 వ సంవత్సరంలో బంగారం ధరలు తులానికి కేవలం రూ.83.75 మాత్రమే ఉండేది. అది అప్పటి నుంచి కొద్దికొద్దిగా పెరుగుతూ రెండంకెల సంఖ్య కాస్తా మూడంకెలకు చేరుకుంది. ఆ తరువాత 2000 సంవత్సరంలో బంగారం ధర నాలుగంకెలకు చేరి రూ.4,400గా నమోదయ్యింది. సరిగ్గా ఐదు సంవత్సరాల తరువాత అంటే 2005లో దాని ధర రూ.7000 కు చేరుకుంది. మరో ఐదు సంవత్సరాలకు అంటే 2010లో ఏకంగా 10వేలు పెరిగి రూ.18,500లకు చేరుకుంది. ఇక 2015లో రూ.26,343 ఉన్న ధర.. 2020వ సంవత్సరంలో ఒక్కసారిగా ధర భారీ స్థాయిలో పెరిగి రూ.48,651 గా నమోదయ్యింది. ఇక 2022లో రూ.52,670కి చేరుకుంది. 2023 అంటే ప్రస్తుతం రూ.61,095లకు చేరుకుంది. ఈ ధరల పెరుగుదలను చూస్తే ఇక రాబోయే రోజుల్లో బంగారాన్ని షాపుల్లో చూడటమే తప్పించి కొనుక్కునే పరిస్థితి ఉండదనుకుంటా.



Next Story

Most Viewed