పోస్ట్‌మార్టం అయ్యాక మృతికి గల అసలు నిజం ఎలా తెలుస్తుందో తెలుసా?

by Dishanational2 |
పోస్ట్‌మార్టం అయ్యాక మృతికి గల అసలు నిజం ఎలా తెలుస్తుందో తెలుసా?
X

పోస్టుమార్టం చేసే ముందు భుజాల దగ్గర నుంచి రొమ్ముల మీదుగా మర్మాంగం దాకా శరీరాన్ని యూ షేప్‌లో లేదా వై షేప్‌లో కోస్తారు. చర్మం లోపల కండర భాగాన్ని తీసేస్తారు. శరీరంలో ముఖ్యమైన భాగాలు అన్నిటిని కూడా బయటకి తీయడం జరుగుతుంది. పుర్రె వెనుక భాగాన్ని ఒక చెవి నుండి ఇంకో చెవి వరకు కోస్తారు. పై భాగాన్ని పైకి తీసేస్తారు కింద భాగాన్ని కిందకి తీసేస్తారు. పుర్రెను తీసేసి మెదడుని బయటికి తీస్తారు.

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైనా వ్యక్తి అనుమానాస్పదంగా మరణించినా లేదు, హత్య చేసినా.. చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహించి. నిందుతులను పట్టుకుంటారు.అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు చనిపోయి వ్యక్తికి పోస్టుమార్టం చేయడం ద్వారా సరైన కారణం ఎలా తెలుస్తుందని, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాథాలజీ డాక్టర్లు మాత్రమే పోస్టుమార్టం చేస్తారు. పోస్టుమార్టం ఎప్పుడైనా చేయాల్సి వస్తే దాన్ని మెడికో లీగల్ అటాప్సీ అని అంటారు.

పోలీసులు లేదా కోర్టుల అభ్యర్థన మేరకు చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తారు. అయితే కేసును బట్టి పోస్టుమార్టం సమయం పడుతుంది. మొదట చనిపోయిన వ్యక్తి మీద గాయాలు, గుర్తులు ఏమైనా ఉంటే వాటిని నమోదు చేస్తారు. అలానే చనిపోయిన వ్యక్తి బరువు ఇటువంటివన్నీ కూడా చూస్తారు. పోస్టుమార్టం అయిపోయిన తర్వాత శరీరానికి కుట్లు వేసి డ్రెస్సింగ్ చేస్తారు.

పోస్టుమార్టం చేసే ముందు భుజాల దగ్గర నుంచి రొమ్ముల మీదుగా మర్మాంగం దాకా శరీరాన్ని యూ షేప్‌లో లేదా వై షేప్‌లో కోస్తారు. చర్మం లోపల కండర భాగాన్ని తీసేస్తారు. శరీరంలో ముఖ్యమైన భాగాలు అన్నిటిని కూడా బయటకి తీయడం జరుగుతుంది. పుర్రె వెనుక భాగాన్ని ఒక చెవి నుండి ఇంకో చెవి వరకు కోస్తారు. పై భాగాన్ని పైకి తీసేస్తారు కింద భాగాన్ని కిందకి తీసేస్తారు. పుర్రెను తీసేసి మెదడుని బయటికి తీస్తారు.

అయితే కేసును బట్టి శరీర భాగాల్లో పరీక్షలు ఉంటాయి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి అనుమానంగా ఉన్న వాటిని పంపిస్తారు. అక్కడ వారు ఆ భాగాలను పరీక్షించి, చనిపోయిన వ్యక్తి ఏ కారణంగా చనిపోయారో తెలియజేస్తారు. పోస్టుమార్టం అయిపోయాక మళ్ళీ తీసేసిన భాగాన్ని లోపల పెట్టడం పరిస్థితిని బట్టి ఉంటుంది.ఇలా పోస్టుమార్టంనిర్వహించి, అసలు మృతికి గల అసలు విషయం తెలియజేస్తారు.

Next Story

Most Viewed