పిండానికి తండ్రి, తల్లి రూపం ఎలా ఏర్పడుతుందో తెలుసా..?

by Disha Web Desk 23 |
పిండానికి తండ్రి, తల్లి రూపం ఎలా ఏర్పడుతుందో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20శాతం పెళ్లిళ్లు దగ్గరి బంధువుల్లోనే జరుగుతున్నాయి. తెలుగు కుటుంబాలలో మేనరికపు వివాహాలు సర్వసాధారణం. ఇలాంటి వివాహాలను వైద్య పరిభాషలో ‘కన్‌సాంగ్వినియస్ మ్యారెజెస్’ అంటారు. మేనరికం వివాహాలు చేసుకున్నవారికి పుట్టుకతోనే లోపాలతో బిడ్డలు పుట్టే అవకాశం ఉంది. తలసీమియా, మూత్రపిండాల వ్యాధులు, కండరాలు, నరాల వ్యాధులు, బుద్ధిమాంద్యం, శ్వాససంబంధిత సమస్యలు, గుండెలో రంధ్రాలు... వంటి అనారోగ్య సమస్యలు మేనరికానికి పుట్టిన బిడ్డల్లో కలగచ్చు. అలాగని మేనరికపు వివాహాలు చేసుకున్న అందరికీ ఇలాంటి పిల్లలే పుడతారని చెప్పలేం. అలాంటి పెళ్లిళ్లు చేసుకున్నవారిలో 4 నుంచి 6 శాతం మందికి పుట్టిన పిల్లల్లో ఇలా జరగొచ్చు.

పుట్టే బిడ్డలో లోపాలెందుకో తెలుసుకోవాలనుకుంటే పిండం ఏర్పడే విధానాన్ని తెలుసుకోవాలి. మానవ కణంలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి. అంటే మొత్తం 46 క్రోమోజోములు. వీటిలో 23 మహిళ నుంచి, 23 పురుషుడి నుంచి వస్తాయి. అవి కలిసి ఒక కణంగా ఏర్పడతాయి. ఆ కణం పిండంగా మారుతుంది. ఈ జన్యువులే తండ్రి నుంచి, తల్లి నుంచి పోలికలను మోసుకొస్తాయి. వేర్వేరు కుటుంబాలకు చెందిన స్త్రీ, పురుషుడు కలవడం వల్ల ఆరోగ్యకరమైన పిండం ఏర్పడే అవకాశం అధికంగా ఉంటుంది. కానీ ఒకే కుటుంబానికి చెందిన(మేనరికం) స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకుంటే ఇద్దరి జన్యువులు ఒకేలా ఉండొచ్చు. అంటే అనారోగ్యకర జన్యువులు కలవచ్చు. అప్పుడు పుట్టే బిడ్డలో ఏమైనా లోపాలు తలెత్తవచ్చు. అందుకే మేనరిక వివాహాలకు దూరంగా ఉండమని వైద్య నిపుణులు చెబుతారు.

ఇవి కూడా చదవండి:

పురుషుల సరసం.. తట్టుకోలేకపోతున్న స్త్రీలు

Next Story

Most Viewed