ఎండకాలం లిచీ పండు తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

by Disha Web Desk 10 |
ఎండకాలం లిచీ పండు తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: లిచీ పండు మనందరికీ తెలిసిందే. ఇది ఒక అద్భుతమైన పండు.ఈ పండు తినడానికి రుచిగా ఉంటుంది. అయితే, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా వేసవిలో లిచీ పండ్లను ఆహారంలో చేర్చుకుంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. లీచీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్లు..

మీ ఆహారంలో లీచీలను చేర్చుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఫ్రీ రాడికల్ సమస్యల నుండి రక్షిస్తుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం..

లీచీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అదనంగా, ఇది ఎండ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది.

మెరుగైన జీర్ణక్రియ

లీచీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఇది మలబద్ధకం నుండి రక్షిస్తుంది.

బరువు

లిచీ పండ్లు చాలా తీపిగా ఉంటాయి. అయితే, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. లీచీలో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. మామిడిపండు తినలేని వాళ్లు లిచీని తినవచ్చు. బరువు పెరగకుండా ఉంటారు.



Next Story

Most Viewed