Weight loss: వెయిట్ లాస్ అవ్వాలంటే అన్నం మానేయాల్సిందేనా? నిపుణలు ఏం చెబుతున్నారంటే?

by Disha Web Desk 9 |
Weight loss: వెయిట్ లాస్ అవ్వాలంటే అన్నం మానేయాల్సిందేనా? నిపుణలు ఏం చెబుతున్నారంటే?
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో బరువు పెద్ద సమస్యగా మారిపోయింది. బరువు తగ్గడం కోసం పలువురు పలు చిట్కాలు పాటిస్తుంటారు. కఠిన వ్యాయామాలు చేస్తుంటారు. అలాగే ఆహారం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వెయిట్ లాస్ అవ్వడం కోసం కొంతమంది సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటూ.. పూర్తిగా అన్నం తినడం మానేస్తారు. ఇప్పటికి కొంతమందిలో అన్నం తింటే బరువు పెరుగుతారనే అపోహ ఉంది.

రైస్‌లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రపంచంలో ఎక్కవ మంది తినే ఫుడ్‌లో అన్నమే ముఖ్యపాత్ర పోషిస్తుంది. అన్నం దైనందిక కార్యకలాపాలకు అవసరమైన ఎనర్జీని అందిస్తుంది. అయితే రైస్‌లో మన ఆరోగ్యానికి అవసరమయ్యే కార్బోహైడ్రేట్లతో పాటు మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం, ఫైబర్, భాస్వరం, ఐరన్, బి విటమిన్లు వంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ జీర్ణక్రియ, కొవ్వును బర్న్ చేయడం, హార్మోన్లను సమతుల్యం చేయడానికి ఎంతో మేలు చేస్తాయి.

అయినప్పటికి రైస్ వెయిట్ పెరగానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. అన్నాన్ని లిమిట్‌లో తీసుకుంటే ఎలాంటి సమస్య ఉందడు. కానీ మోతాదును మించి తిన్నట్లైతే కచ్చితంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు రోజుకొకసారి మాత్రమే రైస్ తినాలి. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అన్నం తక్కువగా తినాలి. తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రౌస్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎక్కువగా మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Next Story

Most Viewed