నోరు దుర్వాసన వస్తోందా.. అయితే ఈ చిన్న చిట్కాతో మటుమాయం చేయండి!

by Disha Web Desk 9 |
నోరు దుర్వాసన వస్తోందా.. అయితే ఈ చిన్న చిట్కాతో మటుమాయం చేయండి!
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ నోటి నుంచి దుర్వాసన రావడం సహజం. ఈ దుర్వాసన వల్ల మీతో పాటు మీ చూట్టూ ఉన్నవారు కూడా ఇబ్బంది పడతారు. బయట నలుగురిలో మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ నోటి దుర్వాసనను పూర్తిగా తొలగించుకోవాలంటే మీరు ఈ నిపుణులు చెప్పిన చిట్కాలను పాటించాల్సిందే.

నీటిని తక్కువగా తీసుకోవడం వల్ల, సరిగ్గా బ్రష్ చేయకపోవడం, కొన్ని గంటల పాటు మాట్లాడకుండా ఉండడం వల్ల నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోయి నోటి నుంచి చెడు వాసన వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లినా టూత్‌ బ్రష్‌ను, టూత్పేస్ట్‌‌ను తీసుకెళ్లడం సాధ్యం కాదు కాబట్టి దీని నుంచి బయట పడాలంటే పుదీనా అలాగే నిమ్మరసం నోటి దుర్వాసనను పోగొట్టడానికి ఒక ఔషధంగా పనిచేస్తుందని డాక్టర్లు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం..


సిట్రస్ పండు అయిన నిమ్మకాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీని నుంచి మన శరీరానికి అవసరమైన ‘విటమిన్ సి’ పుష్కలంగా లభిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగినప్పుడు మిమ్మల్ని హైడ్రేట్‌ చేయడానికి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను పెంచుతుంది. నిమ్మరసంతో దాహం, వికారం, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయని వైద్యులు చెబుతున్నారు.

నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ చిగుళ్ళలోని బంధన కణజాలాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడానికి, దంతాలను బలపరచడాని, చిగుళ్లవాపు వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే మీ నోటి దుర్వాసనను నివారిస్తుంది. కానీ కొంతమంది దంతవైద్యులు నోటి దుర్వాసను సిఫారసు చేసే ప్రొఫెషనల్ క్లీనింగ్‌కు నిమ్మరసం ప్రత్యామ్నాయం కాదని చెబుతున్నారు. బ్రష్ చేయడం, ఫ్లోసింగ్ చేయడం, నాలుకను శుభ్రం చేయడానికి మీ నోటి పరిశుభ్రత చిట్కాలను పాటించాలని అంటున్నారు.

నిమ్మకాయ రసంతో నోటి దుర్వాసనను తొలగించే తీరు..


ఒక కప్పు పిండిలో నిమ్మరసాన్ని పిండి.. గోరువెచ్చని నీటితో కలిపి తర్వాత మౌత్ వాష్‌గా వాడచ్చు. అలాగే నిమ్మరసంలో కొన్ని కీరదోసకాయ ముక్కలు, కొన్ని తాజా పుదీనా లేక అల్లాన్ని మిక్స్ చేసి తాగితే మీ ఆరోగ్యంగా ఉండంటంతో పాటు వాసన కూడా మటు మాయం అవుతుంది. కానీ నిమ్మరసాన్ని పరిమిత పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలని, అధికంగా తీసుకోవడం వల్ల ఎక్కువ సిట్రిక్ యాసిడ్ కంటెంట్ వల్ల దంతాలు అరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. నోటి దుర్వాసనను పోగొట్టడానికి రోజంతా 2 - 3 నిమ్మకాయల రసాన్ని తీసుకుంటే చాలని, అంతకంటే ఎక్కువగా ఉపయోగించకూడదని అంటున్నారు నిపుణులు.

Also Read...

గర్భం దాల్చకుండా ఉండటానికి కొత్త పద్ధతి.. AP, TS, UP లో త్వరలో అమలు



Next Story

Most Viewed