వర్షాకాలంలో స్కిన్ ఇన్ఫెక్షన్లు.. డయాబెటిస్ బాధితులు జాగ్రత్త !

by Prasanna |
వర్షాకాలంలో స్కిన్ ఇన్ఫెక్షన్లు.. డయాబెటిస్ బాధితులు జాగ్రత్త !
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో పలు అంటువ్యాధులతోపాటు స్కిన్ ఇన్‌ఫెక్షన్లు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ బాధితుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుందని చెప్తున్నారు. చల్లటి వాతావరణం, గాలి, నీటి కాలుష్యాలు, బ్యాక్టీరియా, ఫంగస్‌ల వ్యాప్తి, వీటికితోడు షుగర్ లెవల్స్ పెరగడం స్కిన్ ఇన్ఫెక్షన్లు పెరిగేందుకు కారణం అవుతాయి. చర్మంపై దురద పుట్టడం, పుండ్లు ఏర్పడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడంవల్ల కొల్లాజెన్ అనే హార్మోన్ దెబ్బతింటుంది. ఫలితంగా ఇన్‌ఫెక్షన్ త్వరగా తగ్గదు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ బాధితులు చర్మ సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణకు ఇంట్లో పాటించాల్సిన నివారణ చర్యలు ఉన్నాయి. అవేంటంటే.. చల్లటి వాతావరణంలో తడిగా ఉండే బట్టలను ఎక్కువసార్లు తాకడం, వేసుకోవడం చేయకూడదు. ఐస్ క్రీములు అస్సలు తినవద్దు. స్పైసీ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు. పండ్లు, తాజా కూరగాయలు మాత్రమే తీసుకోవాలి. రోడ్లపై నిలిచే వర్షపు నీటిలో కాళ్లు తడిచేలా నడిస్తే డయాబెటిస్ బాధితులు త్వరగా స్కిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో, ఆరు బయట అపరిశుభ్రత వల్ల కూడా ఫంగస్ సోకుతుంది. ఇక వర్షం పడుతున్నప్పుడు రోడ్లపై పారే వరదనీటిలోంచి నడవడం చేయకూడదు. ఒకవేళ బయటకు వెళ్లిప్పుడు రోడ్లపై పారుతున్న మురుగు నీటిలోంచి నడవక తప్పని పరిస్థితి ఏర్పడితే గనుక ఇంటికి రాగానే వెంటనే వేడినీటితో స్నానం చేయాలి. ఒకవేళ దురద, మంట, చర్మం రంగు మారడం వంటి సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: బర్త్‌డే స్పెషల్.. ఒక్క రూపాయకే బిర్యాని.. ఎక్కడో తెలుసా?

Next Story

Most Viewed