వీటిని తినడం వల్ల బట్టతల వచ్చే ఛాన్స్?

by Disha Web Desk 10 |
వీటిని తినడం వల్ల బట్టతల వచ్చే ఛాన్స్?
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మందికి జుట్టు అంటే ఇష్టం. మహిళలు అయితే చెప్పాలిసిన అవసరమే లేదు.. ఎందుకంటే జుట్టు ఊడిపోతే అదే పనిగా బాధపడుతూ ఉంటారు. దీనికి గల కారణం వాతావరణంలోని కాలుష్యం, మనం తీసుకునే ఆహారం. సాధారణంగా వృద్ధాప్యంలో ఎవరికైనా జుట్టు పల్చబడుతుంది. కానీ ప్రస్తుతం కాలంలో చిన్న వయసులోనే చాలామందికి జుట్టు రాలే సమస్య ఉంది. అయితే కొన్ని ఆహారాలు కూడా మన జుట్టును ప్రభావితం చేస్తాయి. దీనివల్ల జుట్టు బలహీనంగా మారి తెగి ఊడిపోతుంది. దీని వల్ల బట్టతల వచ్చే అవకాశం ఉంది. జుట్టుని బలహీనం చేసే ఆహారాలు పదార్ధాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

ప్రాసెస్ చేసిన ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. ఈ ఆహారాలు ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా మంచివి కావు. చక్కెర ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ని తినకూడదు. అలాగే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వలన జుట్టు పెరుగుదల మందగించి రక్త నాళాలు దెబ్బ తింటాయి.దీని వల్ల ఆక్సిజన్ కావాల్సినంత మొత్తంలో జుట్టుకు అందక ఊడిపోతుంది. చాలామంది రెడ్ మీట్ ను ఎక్కువగా తినేస్తుంటారు. రెడ్ మీట్ తీసుకుంటే జుట్టు బాగా పల్చబడి, బలహీనంగా మారుతుంది. కాబట్టి ఆహార విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది.



Next Story

Most Viewed