వారంలో రెండు సార్లు ప్రెగ్నెంట్ అయిన మహిళ.. ఎలా సాధ్యమైంది?

by samatah |
వారంలో రెండు సార్లు ప్రెగ్నెంట్ అయిన మహిళ.. ఎలా సాధ్యమైంది?
X

దిశ, ఫీచర్స్: కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు కుమార్తెలకు గర్భం దాల్చినట్లు వెల్లడించింది. గతంలో దురదృష్టవశాత్తూ గర్భస్రావం జరిగిన తర్వాత.. 2020లో బిడ్డ పుట్టబోతోందని ఒడాలిస్-ఆంటోనియో మార్టినెజ్ దంపతులు సంతోషించారు. దీన్ని ధృవీకరించుకునేందుకు స్కానింగ్‌కు వెళ్లగా ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు గర్భం దాల్చిందని తెలిపారు డాక్టర్స్. ఈ అసాధారణమైన సంఘటనను 'సూపర్ ఫెటేషన్' అని పిలుస్తుండగా.. మొదటి గర్భం తర్వాత రోజులు లేదా వారాల తర్వాత సూపర్‌ఫెటేషన్ జరగవచ్చు. ఇది మరొక గర్భానికి దారి తీయవచ్చు.

సూపర్‌ఫెటేషన్ అనేది రెండు గర్భాలు ఏకకాలంలో సంభవించడాన్ని వివరించడానికి ఉపయోగించే పదం. మొదటి అండం గర్భంలో అమర్చబడిన రోజులు లేదా వారాల తర్వాత.. రెండవ అండం స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చెందుతుంది. అయితే వారు ఒకే రోజు ప్రసవించబడవచ్చు. కాబట్టి 'సూపర్‌ఫెటేషన్' ద్వారా జన్మించిన పిల్లలు తరచుగా కవలలుగా భావించబడతారు.

2020 ప్రారంభంలో ఒడాలిస్ గర్భవతి అయింది. కానీ తమ 12 వారాల చెకప్‌లో గర్భస్రావం జరిగిందని తెలుసుకున్నారు. మరుసటి నెల మళ్లీ ప్రయత్నించాలని సదరు జంట నిర్ణయించుకోవడంతో ఆమె గర్భవతి అయింది. పరీక్ష పాజిటివ్‌గా వచ్చిందని, 'సూపర్ ఫెటేషన్'తో డబుల్‌ హ్యాపీగా ఉన్నామని తెలిపారు. పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు ఒకేలా ఉన్నారని, వారిని గుర్తించడం ఇప్పటికీ తన భర్తకు పరీక్షనేనని చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed