తోట ఏర పోతే నెలకు ఏకంగా రూ. 5 లక్షలు.. క్యూ కడుతున్న జనాలు.. ఎక్కడంటే..

by Dishafeatures3 |
తోట ఏర పోతే నెలకు ఏకంగా రూ. 5 లక్షలు.. క్యూ కడుతున్న జనాలు.. ఎక్కడంటే..
X

దిశ, ఫీచర్స్ :సాధారణంగా రైతులు పంట విత్తనాలు పెట్టినప్పటి నుంచి కోత కోసే వరకు కూలీలతో పని చేయించుకుంటారు. రోజువారీ కూలీ చెల్లుస్తుంటారు. ఇక నాటు వేయాలి అంటే గుత్త పడుతుంటారు. తమకు ఎకరానికి ఇంత ఇవ్వాలని ముందే కండిషన్ పెడుతారు. ఇలా ఎంత చేసినా రోజుకు వెయ్యికి మించి మాత్రం సంపాదించరు. కానీ ఇదే పని లండన్ లో చేస్తే మాత్రం ఏడాదికి ఏకంగా రూ. 63 లక్షలు చెల్లిస్తున్నారు. మీరు వింటున్నది అక్షరాల నిజమే. కాగా ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం.

లండన్ లో క్యాబేజీ, బ్రోకలి తోటల నుంచి కలెక్ట్ చేసి ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ సాఫ్ట్ వేర్ జాబ్ లకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండటంతో కూలీలు కరువయ్యారు. దీంతో ఈ కూరగాయల వ్యాపారం చేస్తున్న యజమానులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ క్యాబేజీ, బ్రోకలి తోట నుంచి తీసుకొచ్చి ప్యాక్ చేస్తే ఏడాదికి రూ. 63 లక్షలు చెల్లిస్తామని ప్రకటించారు. అంటే సదరు కూలీకి నెలకు రూ. 5 లక్షలపైనే చెల్లిస్తున్నట్లు లెక్క. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నిరుద్యోగులు అర్జంట్ గా ఫ్లైట్ ఎక్కితే బాగుండు అనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed