చతురస్రాకార చక్రాలతో సైకిల్.. భలే కదులుతుందే!!

by Disha Web Desk 13 |
చతురస్రాకార చక్రాలతో సైకిల్.. భలే కదులుతుందే!!
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా వాహనాల చక్రాలు వృత్తాకారంలోనే ఉంటాయి. అలా గుండ్రంగా ఉంటేనే భౌతికశాస్త్ర నియమాలను అనుసరిస్తూ ఆ వెహికిల్ ముందుకు సాగగలుగుతుంది. కానీ ఇందుకు విరుద్ధంగా చతురస్రాకారంలో సైకిల్ చక్రాలు తయారు చేసిన యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అండ్ ఇంజనీర్ సెర్గీ గోర్డియెవ్ జనాలను ఆశ్చర్యానికి గురిచేశాడు.

ఇప్పటికే మంచు మీద ప్రయాణించే సైకిల్, ప్రపంచంలో అతి చిన్న సైకిల్‌ను రూపొందించిన ఆయన.. ప్రస్తుతం స్క్వేర్ వీల్స్‌తో సులభంగా ముందుకు వెళ్తున్న సైకిల్ వీడియోను పోస్ట్ చేసి సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేశాడు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్‌లో కొందరు ఈ క్రియేటివిటీపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం గందరగోళంలో ఉండిపోయారు.



Next Story

Most Viewed