ఎక్కువగా ఫోన్ మాట్లాడుతున్నారా.. అయితే హైబీపీ ముప్పు తప్పదు

by Disha Web Desk 6 |
ఎక్కువగా ఫోన్ మాట్లాడుతున్నారా.. అయితే హైబీపీ ముప్పు తప్పదు
X

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటి నుంచి చిన్నా పెద్ద ఫోన్లకు బానిసలు అయిన విషయం తెలిసిందే. ప్రతి క్షణం ఫోన్ లో మునిగిపోయి వారు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని కూడా మరిచి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే కొంత మంది గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతూ మైమరచి పోతుంటారు. వారి పక్కన ఏం జరిగినా కానీ, పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొబైల్ ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడటం వల్ల ఆరోగ్యానికి పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చైనా శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో తేల్చి చెప్పారు. అంతేకాకుండా వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కవ సేపు ఫోన్‌లో మాట్లాడితే అధిక రక్తపోటు ముప్పు సుమారు 12 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. డిజిటల్ హెల్త్ అనే యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచూరితమయ్యాయి. అయితే వారంలో 5 నిమిషాల కంటే తక్కువ మొబైల్‌లో మాట్లాడే వారితో పోలిస్తే 30-59 నిమిషాలు మాట్లాడే వారిలో 8 శాతం, 1-3 గంటలు మాట్లాడే వారిలో 13 శాతం, 4-6 గంటలు మాట్లాడే వారిలో 25 శాతం బీపీ పెరిగే ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికీ బీపి సమస్యలు ఉన్నవారు 30 నిమిషాల కంటే ఎక్కువ మొబైల్‌ మాట్లాడటం వల్ల హైబీపీ ప్రమాదం 33 శాతం ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి ఫోన్ మాట్లాడటం ఎంత తగ్గిస్తే ఆరోగ్యానికి అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Read more:

ప్రపంచంలోనే అతిపెద్ద నాగలి



Next Story

Most Viewed