మీ చిన్నారులకు ఈ సెరిలాక్ తినిపిస్తున్నారా..ఇది చాలా ప్రమాదం!

by Disha Web Desk 8 |
మీ చిన్నారులకు ఈ సెరిలాక్ తినిపిస్తున్నారా..ఇది చాలా ప్రమాదం!
X

దిశ, ఫీచర్స్ : అమ్మతనం ఓ గొప్ప వరం. నవమాసాలు మోసి ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లి ఆనందం మాటల్లో చెప్పలేనిది. చాలా సంతోషపడుతుంది. ఇక పుట్టిన నుంచి తన బిడ్డ విషయంలో ఆ కన్న తల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. తన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది. ప్రతి నెల తనలో ఏ మార్పులు వస్తున్నాయి. పాలు సరిగ్గా తాగుతున్నారా? ఫార్ముల మిల్క్ పెడితే ఎంత వరకు పెట్టాలి? ఇలా ఎన్నో విషయాలను తెలుసుకుంటూ తన పాపకు ఏ టైమ్‌లో ఏది అవసరమో అది పెడుతుంది తల్లి. అయితే పాప లేదా బాబుకు ఆరు నెలలు వచ్చిన తర్వాత చాలా మంది సహజంగా సెరిలాక్ తినిపిస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్‌లో ఎక్కువగా నెస్లే కంపెనీకి చెందిన సెరిలాక్సే ఉంటున్నాయి. ఇక వాటినే తీసుకొచ్చి చిన్నారులకు ప్రతి రోజూ తినిపిస్తుంటారు.

కాగా, తాజాగా జరిపిన అధ్యయనంలో నెస్లే కంపెనీకి చెందిన బేబీ ప్రొడక్స్‌లో అధిక చెక్కెర ఉంటుందని తేల్చి చెప్పింది. ఇవే ప్రొడక్ట్స్ యూకేలో షుగర్ ఫ్రీ గా ఉన్నాయని, అలాంటప్పుడు ఇండియాలో మాత్రం షుగర్ కంటెంట్ ఎందుకు ఉంటోందని Public Eye సంస్థ ప్రశ్నించింది. ఇండియాలో దాదాపు 16 సెరిలాక్ ప్రొడక్స్ట్‌లో ఒక చెంచా ప్రొడక్ట్‌లో 3 గ్రాముల చక్కెర ఉంటోందని తెలిపింది. కానీ యూకే, జర్మనీలో మాత్రం షుగర్ లేదు, ఎందుకు మన ఇండియాలోనే ఇలా ఎక్కువ ఎందుకు ఉంటుంది. దీని వల్ల చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఊబకాయంతో పాటు చిన్నారులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే అవకాశం ఉందని సంస్థ అసహనం వ్యక్తం చేసింది.

ఇక దీనిపై నెస్లే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్పందిస్తూ.. దాదాపు ఐదు సంవత్సరాలుగా మేము చిన్నారుల కోసం విక్రయిస్తున్న ఆహార ఉత్పత్తుల్లో షుగర్ కంటెంట్ 30 శాతం తగ్గించాము. ఇప్పటికీ తమ ప్రొడక్ట్స్‌ను రివ్యూ చేస్తున్నామని, అవరసమైతే ఫార్ములేషన్‌లో మార్పులు చేస్తామని పేర్కొంది. చిన్నారులకు పోషకాహారం అందించడమే తమ లక్ష్యం అని పేర్కొంది.

Next Story

Most Viewed