లక్షణాలులేని క్యాన్సర్ల నిర్ధారణకు కొత్తరకం బ్లడ్ టెస్ట్

by Disha Web Desk 22 |
లక్షణాలులేని క్యాన్సర్ల నిర్ధారణకు కొత్తరకం బ్లడ్ టెస్ట్
X

దిశ, ఫీచర్స్ : ఎటువంటి లక్షణాలు బయటపడని రోగుల్లో పలు రకాల క్యాన్సర్లను కొత్తగా కనిపెట్టిన బ్లడ్ టెస్ట్ విజయవంతంగా పరీక్షించింది. క్యాన్సర్ నిర్ధారణ పద్ధతులను మెరుగుపరచడంలో పనిచేస్తున్న ఆరోగ్య సంరక్షణ సంస్థ(GRAIL).. పాత్‌ఫైండర్ అధ్యయనంలో భాగంగా 6,662 మంది వ్యక్తులపై ఈ పరీక్ష నిర్వహించింది. ఈ మేరకు 50 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న రోగులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదమున్నందున వారిపై ఈ టెస్ట్ నిర్వహించారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో సుమారు 1 శాతం మందిలో పరిశోధకులు క్యాన్సర్‌ను కనుగొన్నారు. ఎటువంటి స్క్రీనింగ్ పద్ధతి లేకుండా పరీక్ష ఫలితాలు పొందడం ఇదే తొలిసారి. కాగా గ్యాలరీ(MCED-E) యొక్క ఓల్డ్ వెర్షన్‌తో పాటు Galleri(MCED-Scr) రిఫైన్డ్ వెర్షన్ రెండింటినీ ఉపయోగించి మల్టీ-క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (MCED) పరీక్షను నిర్వహిస్తారు. చాలా సాధారణమైన ప్రీ-మాలిగ్నెంట్ హెమటోలాజిక్ పరిస్థితులను గుర్తించడాన్ని తగ్గించేందుకు, క్యాన్సర్ సిగ్నల్ మూలం అంచనాను మెరుగుపరిచేందుకు ఈ పరీక్ష మునుపటి వెర్షన్ డెవలప్ చేయబడిందని పరిశోధకులు తెలిపారు.

'స్టాండర్డ్ ఆఫ్ కేర్ స్క్రీనింగ్‌కు జోడించినప్పుడు, MCED పరీక్ష కేవలం ప్రామాణిక స్క్రీనింగ్‌తో పోలిస్తే కనుగొనబడిన క్యాన్సర్‌ల సంఖ్యను రెట్టింపు చేసింది. నిజానికి Galleri.. U.S. ప్రివెంటివ్ సర్వీసెస్ టాస్క్ ఫోర్స్-సిఫార్సు చేసిన అన్ని ప్రామాణిక సింగిల్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ కంటే ఎక్కువ క్యాన్సర్స్‌ను గుర్తించింది. వీటిలో కాలేయం, చిన్న ప్రేగు, గర్భాశయానికి సంబంధించి స్టేజ్ I క్యాన్సర్లు, స్టేజ్ II ప్యాంక్రియాటిక్‌తో పాటు బోన్, ఒరోఫారింజియల్ క్యాన్సర్లు ఉన్నాయి' అని GRAIL చీఫ్ మెడికల్ ఆఫీసర్, MD, జెఫ్రీ వెన్‌స్ట్రోమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

క్యాన్సర్ సిగ్నల్ మూలాన్ని అంచనా వేయడంలో 97% కచ్చితత్వాన్ని కలిగి ఉందని.. క్లినికల్ ట్రీట్‌మెంట్ తర్వాత ఈ అధ్యయనంలో పాల్గొన్న చాలా మందిలో మూడు నెలల కంటే తక్కువ వ్యవధిలో క్యాన్సర్ నిర్ధారణను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కొత్త పరీక్ష క్యాన్సర్ స్క్రీనింగ్‌ ద్వారా ఊహించిన దానికంటే ముందుగానే మెరుగైన చికిత్స వ్యూహాలను రూపొందించే అవకాశం ఉంది.

Next Story

Most Viewed