బాబోయ్ ప్రతి రోజూ 5వేల దోమలతో కుట్టించుకుంటున్న వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Hamsa |
బాబోయ్ ప్రతి రోజూ 5వేల దోమలతో కుట్టించుకుంటున్న వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, ఫీచర్స్: వర్షాకాలం వచ్చిందంటే చాలు అన్ని ప్రాంతాల్లో దోమల బెడద జనాలను నిద్రపోనివ్వవు. రాత్రంతా రక్తం పీలుస్తూ చిరాకు తెప్పిస్తుంటాయి. నిద్రపోనివ్వడం పక్కకు పెడితే.. ప్రశాంతత లేకుండా చేస్తాయి. అయితే దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చి ప్రతి ఏడాది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. వర్షాకాలంలో ఇంటి చుట్టు పక్కల ప్రదేశాలు, చెత్తను తీసి వేయకపోతే దోమల బెడద వల్ల వ్యాధులు రావడం ఖాయం. అయితే ప్రజలు వర్షాకాలం చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్దుల విషయంలో అలర్ట్‌గా ఉండి వారికి దోమలు కుట్టకుండా పలు చిట్కాలను పాటిస్తుంటారు. దోమలు కుట్టకుండా ఉండాలని దోమ తెరలు, బ్యాట్లు వాడుతూ వాటిని చంపేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి ప్రతిరోజు 5 వేల దోమలతో కుట్టించుకుంటూ అతని రక్తాన్ని వాటికి అందిస్తున్నాడని సమాచారం. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

అసలు విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన పెరాన్ రాస్ అనే శాస్త్రవేత్త డెంగ్యూపై చాలా కాలంగా పరిశోధన చేస్తున్నాడు. అలాగే దోమ లక్షణాలు, వాటి జీవితకాలంపై రీసెర్చ్ చేస్తూ దోమలకు తన రక్తాన్ని దారపోస్తున్నాడని సమాచారం. ఇంకా పరిశోధన పూర్తి కాకపోవడంతో ప్రతి రోజు ఏకంగా 5 వేల దోమలతో కుట్టించుకుని రక్తాన్ని తాగేలా చేస్తున్నాడు. ప్రస్తుతం పెరాన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ కావడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. ఇందులో పెరాన్ తన చేతిని వేల సంఖ్యంలో దోమలున్న గాజు బాక్స్‌తో పెట్టాడు. దీంతో అవి అతని చేతికి ఉన్న రక్తాన్ని పీల్చి పిప్పి చేశాయి. అతని చేతులపై దద్దుర్లు కూడా వచ్చాయి. అయితే పెరాన్ 15 వేల దోమలతో కూడా కుట్టించుకున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం దోమలు అతని చేతికి కుట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో అంతా షాక్ అవుతున్నారు.



Next Story

Most Viewed