ఇదేం వింత జబ్బురా నాయనా.. ఎలుగుబంటిలా మారుతున్న బాలుడు..

by Disha Web Desk 20 |
ఇదేం వింత జబ్బురా నాయనా.. ఎలుగుబంటిలా మారుతున్న బాలుడు..
X

దిశ, ఫీచర్స్ : గర్భధారణ సమయంలో మహిళలు తమ శరీరం పై, ఆరోగ్యం పై పూర్తి శ్రద్ధ వహించాలని వైద్యులు ఎప్పుడూ చెబుతుంటారు. ఎందుకంటే ఈ సమయంలో తల్లి శరీరం కేవలం తల్లికి మాత్రమే చెందదు. బిడ్డకు కూడా తల్లి శరీరం నుండి పోషకాలు అందుతాయి. పిల్లలు పుట్టినప్పుడు తల్లి నుంచి అందిన పోషకాహారాలే ఉంటాయి. కానీ చాలా సార్లు పిల్లలు పుట్టుకతో వచ్చే వ్యాధుల బారిన పడతారు. ఇది వారి తల్లి తప్పు కాదు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేస్ ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

వైరల్ అవుతున్న ఈ కేసు ఫిలిప్పీన్స్‌కు చెందిన అపయావోకు సంబంధించినది. ఇక్కడ నివసించే అల్మా కుమారుడు జారెన్ గమోంగన్ ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధిపేరు హైపర్‌ట్రికోసిస్. ఇది శరీరం పై వెంట్రుకలు పెరిగే వ్యాధి. అయితే ఆ మహిళ తన బిడ్డను చూడగానే వింత వాదనలు వినిపించింది. వాస్తవానికి ఆ స్త్రీ తన బిడ్డకు ఇలా జరుగుతోందని అస్సలు అనుకోలేదంట. తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె పిల్లిని తిన్నదని ఓ నివేదికలో తెలిపింది.

ఆ చిన్నారికి ఈ వ్యాధి ఎందుకు వచ్చింది ?

డైలీ మెయిల్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ఆ మహిళ పుట్టిన తర్వాత తన బిడ్డను చూసినప్పుడు, ఆమెలో పూర్తిగా మూఢనమ్మకాలు నిండిపోయాయి. ప్రెగ్నెన్సీ సమయంలో పిల్లి తిన్నందుకే ఆ పిల్లాడు శాపానికి గురయ్యాడని చెప్పడం మొదలు పెట్టింది. నిజానికి, స్త్రీ నివసించే చోట, పిల్లులతో నుండి ప్రత్యేక వంటకం తయారు చేస్తారు. గర్భవతిగా ఉన్నప్పుడు అడవి పిల్లులను తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదని, వాటిని తినేదానినని ఆ మహిళ చెబుతోంది.

ఎల్మా మాత్రమే కాకుండా ఆమె గ్రామం మొత్తం ఇలాగే చెబుతుంది. అయితే ఆమె తన బిడ్డను డాక్టర్ వద్దకు తీసుకెళ్లినప్పుడు, అతను వ్యాధి గురించి అల్మాకు చెప్పాడు. ఈ వ్యాధితో బాధపడేవారికి తలపైనే కాకుండా ముఖం, వీపు, చేతులు, ఛాతీ తదితర భాగాల పై కూడా వెంట్రుకలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇది చాలా అరుదైన వ్యాధి. అయితే ఈ వ్యాధి కారణంగా ఈ బిడ్డ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వెంట్రుకలుగల బిడ్డగా ఉండనున్నాడు.



Next Story

Most Viewed