ప్రెగ్నెంట్ అని తెలిసిన 48 గంటల్లో ప్రసవించిన మహిళ

by Disha Web Desk 12 |
ప్రెగ్నెంట్ అని తెలిసిన 48 గంటల్లో ప్రసవించిన మహిళ
X

దిశ, ఫీచర్స్ : మొదటి బిడ్డ పుట్టడం అనేది ప్రతి జంటకు సంతోషకరమైన వార్త. కానీ ప్రసవానికి రెండు రోజుల ముందు ఈ వార్త వస్తే ఎలా ఉంటుంది? యూఎస్‌లోని ఒక జంట ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిసిన 48 గంటల తర్వాత సదరు మహిళ మొదటి బిడ్డకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది.

ఒమాహాలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న 23 ఏళ్ల పేటన్ స్టోవర్.. అలసటగా అనిపించడంతో వైద్యుడిని సంప్రదించింది. అంతేకాదు తన అలసటకు వర్క్ ప్లేస్‌లో ఒత్తిడే కారణమని భావించింది. కానీ ఆమె కాళ్లలో వాపు సహా శరీరంలో మార్పులను గమనించడం ప్రారంభించిన డాక్టర్ ఆమె త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుందని వెల్లడించింది. అయితే సెకండ్ ఒపీనియన్ కోసం అల్ట్రాసౌండ్ పరీక్ష నిర్వహించిన డాక్టర్.. ఆమెను ఖచ్చితంగా గర్భవతిగా నిర్ధారించింది. అంతేకాదు స్టోవర్‌కు మూత్రపిండాలు, కాలేయం పనిచేయడం ఆగిపోయిందని.. చికిత్స కోసం వెంటనే అడ్మిట్ కావాల్సి ఉంటుందని తెలిపింది.

స్టోవర్‌‌కు తీవ్ర ఆరోగ్య సమస్యలు కలిగించే 'ప్రీఎక్లాంప్సియా' ఉందని.. ఇది అధిక రక్తపోటు సహా ఇతర అవయవాలు దెబ్బతినే సంకేతాలతో వర్ణించబడిందని వైద్య నివేదికలు వెల్లడించాయి. అయితే డాక్టర్లు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం తో ఆ రోజు రాత్రి స్టోవర్ మొదటి బిడ్డకు జన్మనిచ్చిందని ఆమె ప్రియుడు చెప్పాడు. కాగా బిడ్డను కాపాడేందుకు వైద్యులు సి-సెక్షన్‌ చేయగా.. మొత్తానికి నాలుగు పౌండ్ల బరువుతో 10 వారాల ముందుగా మగబిడ్డకు జన్మనిచ్చింది స్టోవర్. ఇక వారు కూడా పిల్లలను కనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అనుకున్న సమయం కంటే ముందే జరగడంతో స్టోవర్ దంపతుల ఉత్సాహం రెట్టింపయింది.



Next Story

Most Viewed