జగన్, కేసీఆర్‌కి ఎన్టీఆర్ ఆశీస్సులుంటాయి: లక్ష్మీ పార్వతి

by srinivas |
జగన్, కేసీఆర్‌కి ఎన్టీఆర్ ఆశీస్సులుంటాయి: లక్ష్మీ పార్వతి
X

దిశ, ఏపీబ్యూరో: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కేసీఆర్‌కు దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయని ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారని ఆమె ప్రశంసించారు. అదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాలకు మంచి ముఖ్యమంత్రులు దొరికారని, ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే వారికి ఆయన ఆశీస్సులు ఉంటాయని అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్ కొనసాగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story