ప్రమాదంలో 17 వందల కుటుంబాలు.. ట్విట్టర్‌లో ఎమ్మెల్యేకు వినతులు (వీడియో)

by Disha Web Desk 2 |
ప్రమాదంలో 17 వందల కుటుంబాలు.. ట్విట్టర్‌లో ఎమ్మెల్యేకు వినతులు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుపై నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. నల్లాల నుంచి కలుషిత నీరు వస్తుందని, అవి తాగితే పోయేలా ఉన్నాం అంటూ వాపోతున్నారు. నల్లా తిప్పితే చాలు మురుగు వాసన, నురుగు నీరు వస్తుందంటూ, వీడియోలు తీసి ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యే పద్మారావుకు ట్వీట్లు చేస్తున్నారు. ఇవేనా బంగారు తెలంగాణ నీళ్లు అంటూ ఆయనను నిలదీస్తున్నారు. కలుషిత నీరు తాగి ఎంతో మంది చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని, మీరు మాత్రం ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఎన్నిసార్లు బస్తీలో పర్యటించారో, ఏం సమస్యలు తెలుసుకున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, వెంటనే సమస్యను పరిష్కరించి..ప్రజల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, కలుషిత నీరు తాగి ఇప్పటికే వందల మంది ఆసుపత్రి పాలయ్యారు.

Next Story