ఏవోబీలో మందుపాతరలు స్వాధీనం

by srinivas |
ఏవోబీలో మందుపాతరలు స్వాధీనం
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ, ఒడిశా సరిహద్దులో సాయుధ దళాలను మట్టుబెట్టడానికి మావోయిస్టులు అమర్చిన ఏడు మందుపాతరలను గుర్తించారు. బుధవారం బాంబు స్వ్కాడ్​వాటిని బయటకు తీసి స్వాధీనం చేసుకుంది. ఒడిశా మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పనసపుట్టు పంచాయతీ గురుసేతు అటవీప్రాంతంలో మందుపాతరలను గుర్తించారు. 9వ బీఎస్ఎఫ్ బెటాలియన్ జవాన్లు జోడంబో పోలీస్ స్టేషన్ నుంచి గురుసేతు ప్రాంతానికి వెళ్తుండగా వీటిని పసిగట్టి బాంబు స్క్వాడ్​కు సమాచారం ఇచ్చారు.

Advertisement

Next Story