- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాష్ట్రంలో అరాచక పాలన.. ఫిర్యాదులు నాకు మెయిల్ చేయండి

X
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. బాధితులు ఎవరికి భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎం జగన్ తక్షణమే స్పందించి ఇటువంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎంపీల పేర్లు చెప్పుకొని కొందరు రెచ్చిపోతున్నారని.. ఇష్టారాజ్యంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాధితులు వేధింపులకు భయపడకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల కాపీలు తనకు పంపించాలని కోరారు. బాధితులకు అండగా ఉంటానని ఎంపీ సుజనా చౌదరి హామీ ఇచ్చారు. [email protected] కు మెయిల్ చేయొచ్చని తెలిపారు.
Next Story