రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్

by  |
kannababu
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న వాణిజ్య ఉత్సవ్‌లో రెండో రోజు సమావేశంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ సీఎం జగన్ వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నందున వాటిపై పెట్టుబడులు పెట్టేవారికి ప్రాధాన్యం ఇస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి కోసం సులభతరమైన పాలసీలను తీసుకొచ్చి అమలు చేస్తుందన్నారు. వాణిజ్య ఉత్సవ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎగుమతుల అవకాశాలపై ఆయన చర్చించారు.

కొవిడ్ సమయంలోనూ ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని వివరించారు. దేశంలో జరిగే మొత్తం ఎగుమతుల్లో 5.8% వాటాతో ఎగుమతుల్లో 4వ ర్యాంకులో ఏపీ నిలవడం గర్వంగా ఉందని చెప్పారు. 2020-21లో రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి 172 మిలియన్ టన్నుల ఎగుమతులు జరిగాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టరులను ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూరేలా ప్రయత్నిస్తున్నామని మంత్రి కన్నబాబు వివరించారు.



Next Story

Most Viewed