కేసీఆర్‌ను వ‌ద‌ల‌కండి.. నా చావుకు ఆయ‌నే కార‌ణం (సూసైడ్ వీడియో)‌

by  |
కేసీఆర్‌ను వ‌ద‌ల‌కండి.. నా చావుకు ఆయ‌నే కార‌ణం (సూసైడ్ వీడియో)‌
X

దిశ, వ‌రంగ‌ల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి ఏడు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేష‌న్లు జారీ చేయ‌డం లేద‌ని మ‌న‌స్థాపం చెందిన ఒక కేయూ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ సంఘ‌ట‌న శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం కేయూలో జ‌రిగింది. నా చావుకు సీఎం కేసీఆరే కారణమంటూ బోడ సునీల్ అనే విద్యార్థి సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగాడు.

“నా పేరు బోడ సునీల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతుంది..ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఎలాంటి జాబులు లేవు. నేను చేతకాక చనిపోవడం లేదు …ఈ రాష్ట్రంలో అందరికీ జాబు లో రావాలంటే నేను చావడమే కరెక్ట్. నా చావు చూసైనా కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలి. నిరుద్యోగుల్లారా కేసీఆర్‌ను వ‌ద‌ల‌కండి.. నాచావుకు ఆయ‌నే కార‌ణం” అంటూ వీడియోలో పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఎంజీఎంలో చికిత్స పొందుతున్న సునీల్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని స‌మాచారం. సునీల్ స్వ‌స్థ‌లం మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండ‌లం గుండెంగ గ్రామ స‌మీపంలోని తేజావ‌త్ రామ్‌సింగ్ తండాగా కేయూ విద్యార్థులు చెబుతున్నారు.

Next Story

Most Viewed