ఇక కేంద్రంపై పోరాటం చేస్తాం.. చేనేతలకు అండగా ఉంటామన్న కేటీఆర్

by  |
ఇక కేంద్రంపై పోరాటం చేస్తాం.. చేనేతలకు అండగా ఉంటామన్న కేటీఆర్
X

దిశ, సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగాభివృద్ధికి ఎంత కృషి చేసినా కేంద్రం నుంచి సహకారం అందడంలేదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా కేంద్రానికి ఎన్ని ప్రతిపాదనలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇకపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయమని.. చేనేత కార్మికుల తరఫున పార్లమెంట్‌లో బీజేపీని నిలదీస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రజాక్షేత్రంలోనూ కూడా వదిలి పెట్టబోమన్నారు. శుక్రవారం సిరిసిల్లలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్… కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులకు బతుకమ్మ చీరల రూపంలో ఉపాధి కల్పించడంతో పాటు మరెన్నో పథకాలను అమలు చేస్తోందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల పట్ల చేనేత, జౌళి పరిశ్రమ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం మాత్రం సహకారం అందించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఎన్ని ప్రతిపాదనలు చేసినా.. పట్టించుకోవడం లేదన్నారు.



Next Story

Most Viewed