కంటైన్‌మెంట్ జోన్లలో పర్యటించిన 'కేటీఆర్'

by  |
కంటైన్‌మెంట్ జోన్లలో పర్యటించిన కేటీఆర్
X

దిశ, న్యూస్‌బ్యూరో : హైదరాబాద్‌, ఖైరతాబాద్ పరిధిలోని సీఐబీ క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటైన్‌మెంట్ జోన్లలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం పర్యటించారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా కాపాడేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించిందని, అందులో భాగంగానే కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. స్థానికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, కరోనా లక్షణాలు గనుక కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని కోరారు. లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ.. ఇళ్లకే పరిమితం కావడం ద్వారా సురక్షితంగా ఉండగలుగుతామని, లేదంటే కరోనా వైరస్ బారిన పడే అవకాశాలున్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఎలాంటి వైద్య సహకారం కావాలన్నా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని సూచించారు.

కంటైన్‌మెంట్ జోన్లలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, అత్యవసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అని అక్కడి వారిని వాకబు చేశారు. ‘కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నవారికి భరోసా ఇచ్చేందుకు తాను స్వయంగా ఇక్కడికి వచ్చానని’ తెలిపారు. మంత్రి స్వయంగా పర్యటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, తమకు అందుతున్న నిత్యావసరాల గురించి కనుక్కోవడం ఎంతో భరోసాగా ఉందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

Tags : KTR, Khairatabad, CIB quarters, Continememt Zones


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed