ఐదు నెలల పాపకు పాలు..

by  |
ఐదు నెలల పాపకు పాలు..
X

– ట్విట్టర్ పోస్టుకు కేటీఆర్ స్పందన

దిశ, న్యూస్ బ్యూరో: ‘తల్లి లేని ఐదు నెలల పాపకు పాలు లేవని’ వచ్చిన ట్విట్టర్ పోస్టుకు మంత్రి కేటీఆర్ స్పందించారు. అర్ధరాత్రి సమయంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌ను అలర్ట్ చేయడంతో పాపకు పాలనందించారు. దినసరి కూలి పనులు చేసుకుంటూ ఎర్రగడ్డలో నివసించే ఒక కుటుంబంలో 5 నెలల పాప ఉంది. కాగా, అనారోగ్య కారణాలతో ఆ పాప తల్లి నెల రోజుల కిందట చనిపోయింది. లాక్‌డౌన్ కారణంగా నెల రోజుల నుంచి పని లేకపోవడంతో పాపకు పాలు కొనడం కూడా ఆ కుటుంబానికి కష్టంగా మారింది. పక్కనే ఉండే ఓ వ్యక్తి ఈ సమస్యను అర్ధరాత్రి 12 తర్వాత ట్విట్టర్‌లో కేటీఆర్ గారికి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కేటీఆర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ను తక్షణమే వెళ్లి ఆదుకోవాలని సుచించారు. రాత్రి ఒంటి గంట సమయంలో బాబా ఫసీయుద్దీన్ అక్కడికి చేరుకొని ఆ పాపకు కావాల్సిన పాలు, ఇతర వస్తువులతో పాటు ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. తమ సమస్యపై వెంటనే స్పందించిన కేటీఆర్, బాబా ఫసీయుద్ధీన్‌కు కుటుంబసభ్యులు, స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

Tags : KTR, Twitter, GHMC Deputy Mayor, Daily Labour, Mid Night, 5 months baby



Next Story

Most Viewed