కోలీవుడ్ లోకి.. కృతి శెట్టి..?

118

దిశ, వెబ్ డెస్క్: ఉప్పెన సినిమా విడుదలవ్వకముందే హీరోయిన్ కృతి శెట్టి కి ఆఫర్ క్యూ కట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు కృతి కోలీవుడ్ లోకి వెళ్తున్నట్లు సమాచారం. తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన బేబమ్మ తమిళ స్టార్ హీరో ధనుష్ తో జోడి కట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం నిజమైతే అక్కడ కూడా కృతి శెట్టికి మంచి ఆఫర్లు వస్తాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. కృతి ప్రస్తుతం నాని తో “శ్యామ్ సింగరాయ్”, సుధీర్ బాబుతో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..