టీఆర్పీలు కాదు నిజాలకు చోటివ్వండి : కృతి

by  |
టీఆర్పీలు కాదు నిజాలకు చోటివ్వండి : కృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ కేసులో మీడియా చాలా గుడ్డిగా వ్యవహరిస్తోందని, రియా చక్రవర్తి.. దోషి అని తేలకమునుపే తన ఫొటో పెట్టి మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ పలువురు బాలీవుడ్ నటులు తనకు మద్దతు తెలిపారు. ప్రతీ విషయంలో మీడియా నిజాన్ని చెప్పే ప్రయత్నం చేయకుండా దూకుడుకు పోయి, వారి ఒపీనియన్స్‌నే నిజాలుగా ప్రసారం చేస్తోందని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మలైకా అరోరా.. ఇండియన్ జర్నలిజం ఇంకా దిగజారిపోయి చమురును తాకేలా ఉందని కామెంట్ చేస్తూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పెట్టింది. ఇదే స్టేటస్‌ను దొంగిలించకుండా ఉండలేకపోతున్నాను అంటూ సేమ్ స్టేటస్ అప్‌లోడ్ చేసింది కృతి సనన్.

దీంతో ఓ జర్నలిస్ట్ ఈ పోస్ట్‌ను తప్పుపడుతూ ట్వీట్ చేశారు. కృతి, మలైకాలను ట్యాగ్ చేసిన తను.. సెన్సిబుల్ జర్నలిస్టులు ఉన్నారన్న విషయం మరిచిపోరాదని తెలిపారు. కొందరి కోసం బాలీవుడ్ మొత్తాన్ని నిందించలేదని చెప్పారు. పలు సందర్భాల్లో సెలెబ్రిటీలకు కూడా అనుకూలంగా మాట్లాడామని.. అలాగే మీరు కూడా అలాంటి జర్నలిస్టులకు మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

కాగా, దీనిపై స్పందించిన కృతి.. మీ పాయింట్ అర్థమైందని రిప్లై ఇచ్చింది. నైతిక విలువలతో కూడిన కొందరు జర్నలిస్టులు ఉన్నారని తెలుసు. ఇంకా ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రతీ పరిశ్రమ కూడా అభివృద్ధి కావాలనే కోరుకుంటుందన్న కృతి.. జర్నలిజం అనేది శక్తివంతమైన మాధ్యమం అని.. బాధ్యతగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరింది. టీఆర్పీల కన్నా నిజాలకు.. అభిప్రాయాల కన్నా వాస్తవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. బ్లైండ్ ఐటెమ్స్‌కు చోటు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.



Next Story

Most Viewed