సర్పంచ్ లీలలు.. దొంగే దొంగా దొంగా అని అరిస్తే ఎలా..?

by  |
surpanch-mechal
X

దిశ, ఘట్కేసర్ : ఘట్‌కేసర్ మండల పరిధిలోని కొర్రెముల గ్రామంలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న సర్పంచ్ వెంకటేష్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం వార్డు సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. 14శాతం ఫీజు చెల్లిస్తే నిర్మాణాలకు అనుమతులు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి భవన నిర్మాణాల అనుమతులను సర్పంచ్ ఒక్కడే దగ్గరుండి చూసుకుంటూ.. వార్డు సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించడం కరెక్ట్ కాదని విమర్శించారు. పంచాయతీ నిధులకు గండి కొడుతున్న సర్పంచ్ తీరు చూస్తే ‘దొంగే దొంగా దొంగా’ అని అరుస్తున్నట్లు ఉందన్నారు. గత కొంత కాలంగా గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఉన్నత అధికారులను కలిసి విన్నవిస్తామని అన్నారు. మీడియా సమావేశంలో గ్రామ వార్డు సభ్యులు జి.భాస్కర్, బాబు, సునిత, స్వామి, లక్ష్మి, ఆంజనేయులు, ఈశ్వరి, భార్గవి పాల్గొన్నారు.

Next Story

Most Viewed