కరోనా కంటే బెల్టు షాపులు డేంజర్.. కేసీఆర్‌కు కోమటిరెడ్డి సూచన

by  |
KOMATIREDDY
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ పేరుతో గ్రామాల్లో బెల్టు షాపులకు అనుమతులిచ్చి కుటుంబాలను సర్వ నాషనం చేస్తున్నారని మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కంటే బెల్టు షాపులు డేంజర్ అని వ్యాఖ్యానించారు. మద్యం పాలసీ అంటూ టార్గెట్లు పెడుతున్నారని, తెలంగాణ వచ్చిన ఏడాది మద్యం ద్వారా 3,500 కోట్ల రాబడి రాగా.. అది ఇప్పుడు 19వేలు, 20 వేల కోట్లకు చేరిందన్నారు. డబ్బుల కోసం ఇంతలా మద్యాన్ని ప్రోత్సహించడం సరికాదన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన బెల్టు షాపులను మూసివేసే విధంగా సీఎం కేసీఆర్ పునరాలోచించాలని కోరారు.

అంతేకాకుండా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న ‘రైతుబంధు’ పథకంతో ధనిక రైతులే ఎక్కువగా మేలు పొందుతున్నారని ఆరోపించారు. నాకే యేడాదికి రూ.3 లక్షలు వస్తుందని, నాలాగా వేల మంది ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రజా సొమ్మును నిజమైన పేద రైతులకు మాత్రమే అందేలా చూడాలన్నారు. రైతు బంధుకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారని.. ఈ డబ్బును నాన్యమైన విత్తనాలను అందించడానికి, సబ్సిడీ మీద ఎరువులను సరఫరా చేయడానికి, ప్రతి పంటకు గిట్టు బాటు ధర ఇచ్చేందుకు ఖర్చు చేయాలని సీఎం కేసీఆర్ కి సూచించారు. ఇలా చేస్తే వ్యవసాయం చేసే ప్రతి రైతుకు లాభం జరుతుందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 70 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని, పట్టాదారునికే రైతుబంధు అందుతుండటంతో వీరు నష్టపోతున్నారని తెలిపారు.

Next Story

Most Viewed