పేదల సంక్షేమమే మా ఎజెండా

by  |
పేదల సంక్షేమమే మా ఎజెండా
X

దిశ ,భువనగిరి: పేద ప్రజల సంక్షేమమే తమ ఎజెండా అని భువన గిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఆయన ఆలేరు ఎంఎల్ఏ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి శంకు స్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణగా మారుస్తానని కేసీఆర్ చెప్పిన మాయమాటలను నమ్మి స్వంత పార్టీని కాదని తాను ఎమ్యెల్యే పదవిని త్యాగం చేశానని తెలిపారు. సుమారు 1200 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలను చూసి కాంగ్రెస్ తెలంగాణను ఇస్తే.. నేడు తన పోరాటం వల్లే తెలంగాణ ఏర్పడిందని చెప్పి కేసీఆర్ కుటుంబం రాజభోగాలను అనుభవిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడేండ్లలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తండ్రీ, కొడుకులిద్దరూ అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. కానీ రెండు రోజుల క్రితమే టీఎస్ పీఎస్సీ చైర్మన్ చక్రపాణి 35 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రకటించారని ఆయన తెలిపారు. పొద్దంతా కష్టం చేసి, ఒక పూటపస్తులుండి, సంపాదించిన దానితో పేదలు ప్లాట్లను కొన్నారని తెలిపారు. కానీ క్రమబద్దీకరణ పేరుతో ఎల్ఆర్ఎస్ అనే ఒక లైసెన్సు తెచ్చి పేద ప్రజలను కేసీఆర్ , కేటీఆర్ దోచుకోవాలని చూస్తున్నారని ఆయన ధ్వజ మెత్తారు. ఎల్ఆర్ఎస్ చేసు కోకపోతే ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని బహిరంగ ప్రకటనలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ తో 4 నుంచి 5 లక్షల కోట్లు ఖజాన నింపుకోవాలని చూస్తున్నారని తెలిపారు.

Next Story

Most Viewed