ఖజానా కోసం ప్రజలను పీడించాలా: కోమటిరెడ్డి

by  |
ఖజానా కోసం ప్రజలను పీడించాలా: కోమటిరెడ్డి
X

దిశ, నల్లగొండ: లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలకు కరెంట్ బిల్లుల రూపంలో మరింత భారం మోపొద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి లేఖ రాశారు. మూడు నెలలలు కరోనా కారణంగా ఉపాధి లేక సతమతమవుతున్న పేద ప్రజలకు కరెంట్ చార్జీలు పెంచి మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన ఫైర్ అయ్యారు. వెంటనే కరెంట్ మదింపులో సవరింపులు చేయాలని ప్రభుత్వాని కోరారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై కక్ష్య సాధింపు చర్యలు ఎందుకని ప్రశ్నించారు. కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పీడించి ఖజానా నింపుకోవాలని చూస్తుందని మండిపడ్డారు. అప్పులు చేసేది నువ్వు.. భారం ప్రజల పైననా అంటూ ఎద్దేవా చేశారు. వెంటనే బిల్లును సవరించి ప్రజలకు ఊరట కలిగించాలని, లేనిపక్షంలో పార్టీ తరపున ఉద్యమిస్తామన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కోమటి రెడ్డి స్పష్టం చేశారు.



Next Story

Most Viewed