పవర్ స్టార్ ని నాలుగో పెళ్లి చేసుకున్న వివాదాస్పద నటి?.. ఫోటో వైరల్

by  |
vanitha vijay kumar news
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్స్.. వివాదాలకు పర్మినెంట్ అడ్రెస్స్ గా మారిపోయింది నటి వనితా విజయ్ కుమార్. ఆమె ఏమి చేసినా విమర్శలే.. ఎక్కడ ఉన్నా వివాదమే. మూడు పెళ్లిళ్లు, విడాకులు, తండ్రి విజయ్ కుమార్ తో గొడవలు, బిగ్ బాస్, రియాలిటీ షో ఒకటేమిటి.. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఖాయం అనేంతలా మారిపోయింది. ఇక ఇటీవలే తమిళ్ దర్శకుడు పీటర్ పాల్ ని మూడో పెళ్లి చేసుకొని, ఏడాది తిరగకముందే భర్త తాగి హింసిస్తున్నాడని మీడియా ముందు వాపోయిన ఈ నటి తాజాగా నాలుగో పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది.

తమిళనాడు పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పెళ్లి జరిగినట్టు ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. పవర్ స్టార్ ఇక్కడ అంటూ ట్యాగ్ లైన్ ఇస్తూ.. ఇద్దరు పూలదండలు మార్చుకుంటున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఆమె నిజంగానే పెళ్లి చేసుకుందా? లేక సినిమా కోసమా..? అని కొందరు అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమేనని, అభిమానుల్లో జోష్‌ను పెంచడానికి ఈ పని చేసి ఉంటుంది. త్వరలోనే ఆమె అసలు విషయం బయటపెట్టడం ఖాయం అంటూ పెళ్లి వార్తలను కొట్టిపారేస్తున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Facebook official page : https://www.facebook.com/dishatelugunews

Next Story