పోలీస్ స్టేషన్ లో నటి రచ్చ.. టచ్ చేస్తే కత్తితో పొడుచుకుంటానని బెదిరింపు

by  |
kollywood heroine meera mithun arrest
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ లో నటి మీరా మిథున్ వ్యవహారం రోజురోజుకు రచ్చ లేపుతోంది. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైన ఈ భామపై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో మీరా మీథున్‌పై ఏడు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి ఆమెకు సమాన్లు జారీ చేశారు. అయితే ఇంత జరిగినా అమ్మడు మాత్రం తన నోటి దురుసును తగ్గించుకోలేదు. పోలీసులు సైతం తనను ఏమి చేయలేరని, తనను అరెస్ట్ చేయడం ఎవరికి సాధ్యం కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలనీ సావల్ విసిరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శనివారం ఆమెను కేరళలో అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ చేసేటప్పుడు అమ్మడు మామూలు రచ్చ చేయలేదు.

పోలీసులు తనను అరెస్ట్ చేసినప్పుడు ఆమె ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. “ఇక్కడ ఆడవాళ్లకు రక్షణ లేదా..? ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తున్నారు. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందించండి.. పోలీసులు నన్ను టార్చర్ చేస్తున్నారు అంటూ గగ్గోలు పెట్టింది. అంతేకాకుండా అందరు నన్నే టార్గెట్ చేస్తున్నారని, పోలీసులు కనుక నన్ను టచ్ చేస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించింది. ఇది తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస ఇది.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పట్టించుకోండి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నోటి కొచ్చినట్లు మాట్లాడం ఎందుకు.. ఇప్పుడు ఇలా గగ్గోలు పెట్టడం ఎందుకు అంటూ నెటిజన్లు మీరాను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.

Next Story