తడబడి.. నిలబడి.. కోల్‌కతా స్కోరు 163/5

by  |
తడబడి.. నిలబడి.. కోల్‌కతా స్కోరు 163/5
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 35వ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా యావరేజ్‌ స్కోరును నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత తడబడుతూ ఆడిన చివరి నిమిషంలో బ్యాటింగ్‌ స్పీడ్ పెంచి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది.

కోల్‌కతా ఇన్నింగ్స్:

తొలుత ఓపెనింగ్ దిగిన శుబ్ మన్ గిల్ బాల్ టు బాల్ ఆడుతూ.. 37 బంతుల్లో 36 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 23 పరుగులు చేశాడు. 48 పరుగుల వద్ద త్రిపాఠి వికెట్ కోల్పోగా.. 87 స్కోరు బోర్డు వద్ద శుబ్ మన్ గిల్ పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్ రానా 29 పరుగులు చేసి 88 స్కోరు బోర్డు వద్ద వెనుదిరిగాడు. దీంతో తొలి 12.1 ఓవర్లకు కోల్‌కతా టాప్ ఆర్డర్‌ను కోల్పోయింది.

ఇక మిడిలార్డర్‌లో వచ్చిన ఆండ్రూ రస్సెల్ ఈ మ్యాచ్‌లో కూడా క్లిక్ కాలేదు. తడబడుతూ ఆడిన రస్సెల్ 11 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి వికెట్ వదిలేశాడు. 5-6వ స్థానాల్లో బరిలోకి దిగిన ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఇయాన్ మోర్గాన్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి 34 పరుగులు చేశాడు. కానీ, చివరి ఓవర్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక దినేష్ కార్తీక్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా స్కోరు 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

Kolkata Knight Riders Innings

1.శుబ్‌మన్ గిల్ c ప్రియమ్ గార్గ్ b రషీద్ ఖాన్ 36(37)
2. రాహుల్ త్రిపాఠి b టి.నటరాజన్ 23(16)
3. నితీష్ రానా c ప్రియమ్ గార్గ్ b విజయ్ శంకర్ 29(20)
4. ఆండ్రూ రస్సెల్ c విజయ్ శంకర్ b టి. నటరాజన్ 9(11)
5. ఇయాన్ మోర్గాన్ c మనీష్ పాండే b బసిల్ తంపి 34(23)
6.దినేష్ కార్తీక్ నాటౌట్ 29(14)

ఎక్స్‌ట్రాలు: 3

మొత్తం స్కోరు: 163/5

వికెట్ల పతనం: 48-1 (రాహుల్ త్రిపాఠి, 5.6), 87-2 (శుబ్‌మన్ గిల్, 11.4), 88-3 (నితీష్ రానా, 12.1), 105-4 (ఆండ్రూ రస్సెల్, 14.6), 163-5 (మోర్గాన్, 19.6)

బౌలింగ్:

1. సందీప్ శర్మ 4-0-27-0
2. బసిల్ తంపి 4-0-46-0
3.టి నటరాజన్ 4-0-40-2
4.విజయ్ శంకర్ 4-0-20-1
5.రషీద్ ఖాన్ 4-0-28-1



Next Story