రబీలో ధాన్యాన్ని ఎందుకివ్వలేదు? కిషన్ రెడ్డి ప్రశ్న

by  |
Kishanreddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ సీఐకి ఇవ్వాల్సిన రబీలో పండించిన ధాన్యాన్ని నేటికీ ఎందుకివ్వలేదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్​ చేతగాని తనం వల్ల గత రబీ టార్గెట్ పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. భవిష్యత్ లో ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిందని, ఆ కోటా కూడా పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. ధాన్యం సేకరణ ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తున్నా.. కేసీఆ ర్​బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజురాబాద్ ఓటమి తర్వాత కేసీఆర్ బియ్యం అంశాన్ని లేవనెత్తి విష ప్రచారానికి తెరదీశారని, కొంటామని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్ ​చెప్పినా.. కేసీఆర్ ​డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం రబీ నడుస్తోందని, ఖరీఫ్ బియ్యం సేకరణ వచ్చే జనవరి నుంచి ప్రారంభమవుతుందన్నారు. రబీ, ఖరీఫ్ లో ఎంత ముడి బియ్యం ఇచ్చినా తీసుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి అదనంగా నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్​చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందన్నారు.



Next Story