ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ కీలక ప్రకటన..

by  |
cm jagan
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఆరోగ్య అంశంపై ప్రసంగించిన సీఎం జగన్ వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో అనేక మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచామని.. రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించినట్లు సభలో ప్రకటించారు. అలాగే పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర రాష్టాల్లో 130 సూపర్‌ స్పెషాలిటీల్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీపై ఎన్నో మెలికలు పెట్టిందని.. తమ ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీ పరిధిలో రూ.10 లక్షల ఆపరేషన్‌ను కూడా తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. గుండె మార్పిడి బైకాక్లియర్‌, స్టెమ్‌ సెల్స్‌ చికిత్సలు సైతం ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపును తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే కొవిడ్‌ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు తెలిపారు. కొవిడ్‌ అనంతర సమస్యలకు కూడా ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.



Next Story

Most Viewed