అక్రమ రవాణాకు చెక్: డీజీపీ

by  |
అక్రమ రవాణాకు చెక్: డీజీపీ
X

దిశ, క్రైమ్ బ్యూరో : దక్షిణాది రాష్ట్రాల మధ్య మానవ అక్రమ రవాణాను నివారించేందుకు అంతర్ రాష్ట్ర వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలని, అందుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియామకం చేసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం నిర్ణయించింది. మానవ అక్రమ రవాణా నివారణపై దక్షిణాది పోలీసు అధికారుల వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని డీజీపీ Mahender Reddy సోమవారం ప్రారంభించారు. ఈ సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాపై పొరుగు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయంగా ఉన్నాయని కొనియాడారు. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు భవిష్యత్తులో మరింత సమన్వయంగా ఉండేందుకు అంతర్ రాష్ట్రాల మధ్య వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియామకం చేసుకోవాలన్నారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల పోలీసు అధికారులకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు. ఈ సమస్యపై స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం రూపొందించిన దర్పణ్ యాప్ ద్వారా ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాలకు చెందిన 34 మంది పిల్లలను తెలంగాణ పోలీసులు గుర్తించినట్టు తెలిపారు. ఈ తరహా సక్సెస్ అంశాలను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసుకోవాలన్నారు. అన్ని రాష్ట్రాలలో తప్పిపోయిన పిల్లల, మహిళల వివరాలను పొరుగు రాష్ట్రాలకు చెందిన అధికారులకు అందజేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డీఐజీ సుమతితో పాటు ఇతర రాష్ట్రాల డీజీపీలు, మానవ అక్రమ రవాణా నివారణ అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed