‘కవ్వాల్‌లో కాలు మోపితే.. కేసులే’

by  |
‘కవ్వాల్‌లో కాలు మోపితే.. కేసులే’
X

దిశ, ఆదిలాబాద్: కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్, టైగర్ జోన్ కావడంతో అడవిలోకి బయటివారు వెళ్లేందుకు అనుమతి లేదని, ఎవరైనా అతిక్రమించి అడుగుపెడితే కేసులు తప్పవని ఎఫ్‌డీ‌ఓ కోటేశ్వరరావు హెచ్చరించారు. గురువారం ఖానాపూర్ ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఖానాపూర్ కోర్‌జోన్‌లో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, పెద్దపులి, చిరుతపులి, జింకలు, మనబోతులు, నెమళ్లు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి పందులు, నక్కలు, రేస్‌కుక్కలు, ఇతరత్రా జంతువులు అనేకం వున్నాయన్నారు. వీటికోసం అడవిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో గడ్డి పెంపకం చేస్తున్నామన్నారు. తాగునీటి కోసం సాసర్ పిట్లు, సీసీ రింగులు, పర్కులేషన్ ట్యాంకులు నిర్మించామని, ఎప్పటికప్పుడూ వీటిలో నీళ్లను ఫీడింగ్ చేస్తున్నామని అన్నారు. ఎవరైనా అడవిలోకి వెళ్తే జంతువుల బారిన పడే అవకాశం ఉంది. కావున ఎవరూ వెళ్లకూడదని, సమాచారం లేకుండా ఎవరైనా వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed