సల్మాన్‌పై కత్రినా ఆరోపణలు.. అలా ఎందుకు చేసింది?

by  |
సల్మాన్‌పై కత్రినా ఆరోపణలు.. అలా ఎందుకు చేసింది?
X

దిశ, సినిమా : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 15’లో కత్రినా కైఫ్ సందడి చేసింది. డైరెక్టర్ రోహిత్ శెట్టితో కలిసి రియాలిటీ షోకు గెస్ట్‌గా హాజరైన కత్రినా.. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక వీడియో విషయానికొస్తే.. కత్రినా, సల్మాన్ ఎదురెదురుగా కూర్చొని ఉండగా రోహిత్ జడ్జిగా వ్యవహరించాడు. ఈ సందర్భంగా సల్మాన్‌తో షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కత్రినా షేర్ చేసుకుంది.

సల్మాన్ ఎప్పుడూ లొకేషన్‌కు లేట్‌గా వచ్చేవాడని, తన కోసం చాలాసార్లు వెయిట్ చేస్తుండేదాన్నని ఆరోపించింది. ఇక మాజీ ప్రేయసి చేసిన కంప్లైట్స్‌ నిజమేనని ఒప్పుకున్న సల్మాన్.. ఈ క్రమంలో తన కోసం ఒక పాట పాడాలంటూ సల్మాన్‌కు కత్రీనా టాస్క్‌ ఇచ్చింది. దీంతో సల్మాన్ ‘ఓ మేరే దిల్ కే చైన్’ సాంగ్ పాడుతూ సల్మాన్ ఫన్నీ డ్యాన్స్ మూవ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక కత్రినా, సల్మాన్ ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, మైనే ప్యార్ క్యూ కియా సినిమాలతో పాటు ‘హలో’ వంటి సినిమాల్లో నటించి హిట్ పెయిర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed