మంత్రివర్యా.. ఏంటీ పనులు..? కలకలం రేపుతున్నశృంగార సీడీ

by  |
మంత్రివర్యా.. ఏంటీ పనులు..? కలకలం రేపుతున్నశృంగార సీడీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆయనొక బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి. రాజ్యాంగబద్దమైన మంత్రి పదవిలో ఉన్నారు. అంతకుమించి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించారని కార్యకర్తల్లో గుర్తింపు కూడా ఉంది. కానీ అలాంటి వ్యక్తి ఒక యువతితో రాసలీలలు నడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సీడీ ఇప్పుడు అక్కడ కలకలం రేపుతున్నది. కర్నాటకలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

కర్నాటక క్యాబినెట్‌లో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న రమేశ్ జార్కిహోళి ఊహించని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆయన ఒక యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేయడమే గాక ఆమెతో రాసలీలలు నడిపాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన సీడీ ఒకటి ఇటీవలే వెలుగులోకి రావడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కన్నడనాట బీజేపీ ప్రభుత్వం ఇరుకునపడింది. ఒక యువతితో సాన్నిహిత్యం పెంచుకున్న సదరు మంత్రి.. ఆమెకు కర్నాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడని.. ఆనక ఆమెను లైంగికంగా వేధించడాని ఆరోపిస్తూ బాధితురాలు వాపోయింది. అంతేగాక యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియో సీడీని సహా చట్టం కార్యకర్త దినేశ్ కల్లహల్లికి ఆమె అందజేశారు. దీనిని అతడు పలు టీవీ ఛానెళ్లకు ఇచ్చి కనిపించకుండా వెళ్లిపోయారు. యువతికి, తనకు ప్రాణహాని ఉన్నదనీ, తమకు రక్షణ కల్పించాలని ఆయన బెంగళూరు పోలీస్ కమిషనర్ ను కోరారు.

కాగా ఈ వీడియో విడుదలైన అనంతరం మంత్రి రమేశ్ స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదనీ, ఎవరో తన చిత్రాలను ఉపయోగించి మార్ఫింగ్ చేశారని చెప్పుకొచ్చారు. అసలు ఆ యువతి ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. వీడియో సీడీకి సంబంధించి ఎటువంటి విచారణకైనా సిద్దమని అన్న రమేశ్.. తన మంత్రి పదవికి మాత్రం రాజీనామా చేయబోనని ప్రకటించారు.

మరోవైపు రెండు రోజుల్లో కర్నాటకలో శాసనసభ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో రమేశ్ రాసలీలల అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇది గమనించిన బీజేపీ అధిష్టానం.. రమేశ్ ను రాజీనామా చేయాలని ఆయనపై ఒత్తిడి తెస్తున్నది. శాసనసభ సమావేశాలతో పాటు రమేశ్ సొంత నియోజకవర్గమైన బెలగావిలో త్వరలోనే ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడమే ప్రభుత్వానికి మేలు అని కమలనాథులు భావిస్తున్నారు.

కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో రమేశ్ కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వ్యవహారం నడిపిందంతా ఆయనేననీ, కన్నడ నాట బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఈ ఘటనలో ఇరుక్కోవడాన్ని బీజేపీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కన్నడ క్యాబినెట్ లో గ్రూపు తగాదాలు రాజ్యమేలుతున్న తరుణంలో రమేశ్ వ్యవహారం పార్టీకి ఎటువంటి తలనొప్పులు తీసుకువస్తుందో అని వాళ్లు ఆందోళన చెందుతున్నారు.



Next Story

Most Viewed