ఆమె కోసం పోటీపడుతున్న మేకర్స్.. అందరికీ ఇస్తానంటున్న నటి

by  |
ఆమె కోసం పోటీపడుతున్న మేకర్స్.. అందరికీ ఇస్తానంటున్న నటి
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నాకు తాజాగా మరో బిగ్గెస్ట్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. ఏకంగా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌లోనే చాన్స్ కొట్టేసింది. పుష్కర్ ఓజా దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ మూవీ ‘యోధ’లో ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా దిశా పఠానీ నటిస్తుండగా.. రెండో కథానాయికగా రాశీ ఖన్నాను సెలక్ట్ చేసినట్లు సోషల్ మీడియా టాక్. ప్రస్తుతం చేతి నిండ సినిమాలతో బిజీగా ఉన్న రాశీ.. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇక ఇప్పటికే తమిళంలో ‘సర్దార్’, తెలుగులో ‘థాంక్యూ’, ‘పక్కా కమర్షియల్’ సినిమాల్లో నటిస్తున్న భామ.. హిందీలో ‘థాంక్ గాడ్’, ‘రుద్ర’తో పాటు DK-షాహిద్ కపూర్, విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇక ప్రస్తుతం అందుకున్న ఆఫర్‌తో తన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇండియన్ ఫుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వండర్‌ ఉమెన్..

Next Story

Most Viewed