అక్షయ్ సీక్రెట్ కాల్స్ బయటపెట్టిన కంగన..

119

దిశ, సినిమా : బీటౌన్ స్టార్స్‌పై ఎప్పుడూ నిప్పులు చెరిగే కంగనా రనౌత్ బాలీవుడ్‌ వైఖరిపై మరోసారి మండిపడింది. తనను ప్రశంసించడం కూడా తమను ఇబ్బందుల్లో పడేస్తుందని స్టార్స్‌ భయపడుతున్నారని తెలిపింది. అందుకే ‘తలైవి’ ట్రైలర్ చూసిన తర్వాత అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్స్ సీక్రెట్‌గా కాల్స్, మెసేజెస్ చేసి పొగిడారే తప్ప.. ఆలియా భట్, దీపికా పదుకొనే సినిమాలపై స్పందించినట్లు ఓపెన్‌గా ప్రశంసించలేకపోయారని ఫైర్ అయింది.

వీరంతా మూవీ మాఫియాకు భయపడుతున్నారని ఆరోపించింది. సినిమా విషయంలో రాజకీయాలు ఉండకూడదన్న కంగన.. తన రాజకీయ అభిప్రాయాలు, ఆధ్యాత్మిక భావనలకు వ్యతిరేకంగా బెదిరిస్తూ, వేధిస్తూ ఒంటరిని చేస్తే స్పష్టంగా తాను గెలిచినట్లే అవుతుందని తెలిపింది.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..