కమల్ సార్.. సంసారం వ్యాపారం కాదు : కంగన

by  |
కమల్ సార్.. సంసారం వ్యాపారం కాదు : కంగన
X

దిశ, వెబ్‌డెస్క్ : నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తన పార్టీ ఎంఎన్ఎం విజన్ డాక్యుమెంట్‌- 2021ని ప్రకటించారు. గృహిణులకు జీతం ఇచ్చి.. వారిలో వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టిస్తామని ఇందులో పొందుపరిచారు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీనిని అమలు చేస్తామన్నారు. ఈ విషయంపై ఆయన ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటుండగా.. తను మాత్రం కమల్ ఆలోచనను స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు కాంగ్రెస్ లీడర్ శశి థరూర్. ఇంటి పనిని ఓ వృత్తిగా గుర్తించి, జీతం ఇవ్వాలనే ఆలోచన బాగుందని.. గృహిణులకు నెలవారీ వేతనం చెల్లించడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. గృహిణుల సేవలను గుర్తించి ఆదాయాన్ని అందించే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందన్నారు.

కాగా దీనికి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసింది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ప్రతీ విషయాన్ని వ్యాపారాత్మకంగా చూడటం మానేయాలని హితవు పలికింది. ప్రేమతో ముడిపడిన శృంగారానికి ప్రైస్ ట్యాగ్ యాడ్ చేయొద్దని, మాతృత్వానికి వెల కట్టొద్దని.. ఇల్లు అనే చిన్న సొంత రాజ్యానికి రాణిగా మారేందుకు మహిళలకు జీతం అవసరం లేదని చెప్పింది. ‘ముందుగా మీ జీవిత భాగస్వామికి సరెండర్ అయిపోండి.. తను మిమ్మల్ని మాత్రమే కోరుకుంటుంది తప్ప మీ జీతాన్ని కాదు’ అని తెలిపింది కంగన.

Next Story

Most Viewed