సింగరేణి కార్మికులపై కవిత స్పెషల్ కేర్…

by  |
సింగరేణి కార్మికులపై కవిత స్పెషల్ కేర్…
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. గుర్తింపు సంఘం టీబీజీకెఎస్ ద్వారా కరోనా మహమ్మారి బారిన పడ్డ వారికి వైద్య సేవలందించేందుకు సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్షించారు. సింగరేణిలో రూ.3.16 కోట్లతో లక్ష పదివేల రాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేసి కార్మికులకు టెస్టులు చేయనున్నారు.

25 వేల మంది కార్మికులకువ్యాక్సినేషన్ చేయడంతో పాటు మిగతా వారికి కూడా వ్యాక్సిన్ ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కంపెనీల నుండి వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 1,400 బెడ్లతో సింగరేణిలో ప్రత్యేకంగా కొవిడ్ వార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ తో కూడా సంప్రదింపులు జరిపిన కవిత కార్మికులు కరోనా బారిన పడి ప్రాణాలు కొల్పోకుండా ఉండేందుకు అన్ని రకాలా వైద్య సేవలందించే విధంగా చొరవ తీసుకుంటున్నారు.

Next Story

Most Viewed