తల్లిగా ఎన్ని చేసినా వ్యర్థమే :కాజోల్

by  |
తల్లిగా ఎన్ని చేసినా వ్యర్థమే :కాజోల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి కాజోల్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ‘త్రిభంగ’తో ప్రేక్షకులను తాజాగా పలకరించింది. ఒక తల్లికి కూతురిగా. .కూతురికి తల్లిగా కనిపించి మెప్పించిన కాజోల్.. నిజజీవితంలో తల్లిపాత్ర ఎలా ఉండాలనే దానిపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపింది. చాలా విషయాలు చెడ్డ తల్లిగా మారుస్తాయని.. మంచి తల్లిగా నిరూపించుకోవడం కొంచెం కష్టమేనని తెలిపింది. నీసా, యుగ్ దేవగన్‌కు తల్లిగా అన్ని సౌకర్యాలు అందించిన ఆమె.. బిడ్డకు స్వయంగా ఫుడ్ ప్రిపేర్ చేయకపోవడం, స్కూల్ నుంచి తీసుకురాకపోవడం, పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్‌కు అటెండ్ కాకపోవడం.. ఇలాంటి విషయాలు చెడ్డ తల్లిగా చిత్రీకరిస్తాయని అభిప్రాయపడింది. పైగా సమాజం ఒత్తిడి అధికంగా ఉంటుందని తెలిపారు.

పనిచేసే తల్లులు పిల్లలకు తగినంత సమయాన్ని కేటాయించడం లేదనే అపోహ గురించి మాట్లాడిన కాజోల్.. తల్లి బిజీగా ఉన్నా సరే పిల్లల గురించి తప్పకుండా ఆలోచిస్తుందని తెలిపింది. పిల్లలను ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలంటూ మార్కెట్లోకి వచ్చే పుస్తకాల్లో న్యాపీ టై చేయడం వరకు మాత్రమే ఉంటుంది తప్ప.. పిల్లలు ఏడిస్తే ఎలా ఊరుకోబెట్టాలి, ఎలా బుజ్జగించాలి లాంటి ఇంకా లోతైన విషయాల గురించి ప్రస్తావించరని ఫైర్ అయింది. తమ బిడ్డలను ఎలా పెంచాలనే విషయం తల్లిదండ్రులకు తెలుసంది.

మదర్ హుడ్ విషయంలో తన తల్లి తనుజ చాలా ప్రభావితం చేసిందని తెలిపింది కాజోల్. పిల్లలకు మనం ముఖ్యంగా నేర్పించాల్సింది.. సొంతంగా ఆలోచించేలా చేయడమే అని తల్లి నుంచి నేర్చుకున్నట్లు తెలిపింది. ఓన్ డెసిషన్స్ తీసుకోవడం నేర్పించడం మాత్రమే కాదు ఆ నిర్ణయాల వల్ల ఏర్పడే పర్యావసనాలను ఎదుర్కొనే విధంగా పిల్లలను గైడ్ చేయాలని అమ్మ ద్వారా తెలుసుకున్నానని తెలిపింది కాజోల్.



Next Story