అలర్ట్: కడం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు..

by  |
అలర్ట్: కడం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు..
X

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు బుధవారం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులకు గాను 696.325 గా నమోదుగాను. 7.603 టీఎంసీ లకుగాను 6.678టీఎంసీలుగా ఉంది.

ఇన్ ఫ్లో 9,001 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అవుట్ ఫ్లో 12,385 క్యూసెక్కులుగా ఉంది. నీటిని ఎడమ కాలువకు 467 క్యూ సెక్కులునీటిని, కుడి కాలువకు 12 క్యూ సెక్కులు నీటిని వదిలారు. గోదావరి నది ఒడ్డున ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.



Next Story

Most Viewed